హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను బతికించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిజినపల్లి మండలంలోని మంగనూరు, బిజినపల్లి, వెంకటాపూర్, గుడ్లనర్వ, వట్టెం గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా నిర్మిస్తున్న స్మశాన వాటికలను పరిశీలించారు. ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
'ప్రతీ మొక్క బతికినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుంది'
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గ్రామాల్లో కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకస్మికంగా పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా నిర్మిస్తున్న స్మశాన వాటికలు పరిశీలించారు. ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
బిజినపల్లి మండలంలోని గ్రామాల్లో కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకస్మిక పర్యటన
హరితహారం మొక్కలు ఎండిపోగా అందుకు కారణమైన కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోయే దశలో ఉన్న వాటికి నీరు పోయించాలని ఆదేశించారు. గ్రామాల్లో తప్పనిసరిగా ప్రతిరోజు మురికి కాల్వలు శుభ్రంగా ఉంచాలన్నారు. శానిటేషన్ పనులు పక్కాగా అమలు చేయాలని తెలిపారు. వట్టెం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ప్రత్యేక, గోపూజ పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చూడండి:'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం'