తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ - నాగర్​ కర్నూల్​ వార్తలు

శరవేగంగా సాగుతున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సోమవారం నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఎల్లూరు రిజర్వాయర్‌ పనులను పరిశీలించిన అనంతరం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నమూనాల గురించి కలెక్టర్​ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.

collector inspects palamuru rangareddy lift irrigation works
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : Jul 28, 2020, 8:34 AM IST

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూర్ సమీపంలో శరవేగంగా సాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఎల్లూరు రిజర్వాయర్‌ పనులను పరిశీలించిన కలెక్టర్​ ప్రాజెక్టు నమూనా గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. జీరో పాయింట్‌ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నమూనాను ఇంజినీర్ల సాయం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన రిజర్వాయర్‌ బ్యాక్​వాటర్‌ పంపుహౌజ్, జలాశయం పనులు, ఏదుల జలాశయం పనులను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు.

అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనులపై కలెక్టర్​కు ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఆసియాలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం రికార్డు సృష్టించనుందని, 41 అధునాతన పంపులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం రూపొందించామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్టు టన్నెల్‌ పనులను కలెక్టర్​కు చూపించారు. కిలోమీటర్ల మేర టన్నెల్‌లో ప్రయాణించి సొరంగం నిర్మాణం, ప్రాజెక్టు ప్రగతిపై కలెక్టర్ అధికార్లతో చర్చించారు. కలెక్టర్ వెంట ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారి విజయ భాస్కర్​రెడ్డి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details