నాగర్ కర్నూల్ జిల్లా పసుపుల గ్రామ సమీపంలోని గుట్టపైన నిర్విరామంగా కురిసిన వర్షాలతో గుట్టపై నుంచి రాళ్లు కూలాయి. దీనితో మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి. కోడేరు పానగల్ వీపనగండ్ల మండలాల గ్రామాలకు వెళ్లనున్న మిషన్ భగీరథ నీళ్ల సరఫరా ఆగిపోయింది. మంగళవారం జిల్లా కలెక్టర్ చౌహన్ ఘటన స్థలాన్ని సందర్శించి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో పునరుద్ధరణ చర్యలను దగ్గరుండి పూర్తి చేయించారు.
మిషన్ భగీరథ పనులను సందర్శించిన కలెక్టర్ - నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పర్యటన
నాగర్కర్నూల్ జిల్లాలో మిషన్ భగీరథ పనులను జిల్లా కలెక్టర్ చౌహన్ సందర్శించారు. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో పునరుద్ధరణ చర్యలను దగ్గరుండి పూర్తి చేయించారు.
collector chowhan misson bhagiratha works visit in nagarkarnool district
నేటి సాయంత్రానికి ట్రయల్ పూర్తి చేసి... రేపు ఉదయం నుంచి ఆయా మండలాల గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సాయంత్రానికి పైప్లైన్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కోడూరు మండలం 24 గ్రామాలకు రేపటి నుంచి మిషన్ భగీరథ నీరు అందుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!