నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పోషణ మాసం సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గర్భిణీ మహిళలకు చీర, కుంకుమ, పండ్లు అందజేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే తల్లి బలమైన ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి అంగన్వాడీ టీచర్ గర్భిణీ మహిళలకు పోషక పదార్థాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ పద్మావతి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొల్లాపూర్లో సామూహిక సీమంతాలు - నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.
కొల్లాపూర్లో సామూహిక సీమంతాలు