తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Nagar Kurnool Tour : 'ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ లంచాల రాజ్యం వస్తుంది'

CM KCR Comments at Nagar Kurnool Meeting : కొత్త వేషాలతో మళ్లీ మోసగాళ్లు బయలుదేరారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని కొందరు నేతలు మాట్లాడుతున్నారని.. ఒకవేళ అదే జరిగితే మళ్లీ లంచాల రాజ్యం వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ సర్కారుకు.. బీఆర్​ఎస్ సర్కారుకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.

CM KCR
CM KCR

By

Published : Jun 6, 2023, 8:08 PM IST

Updated : Jun 6, 2023, 8:41 PM IST

ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ లంచాల రాజ్యం వస్తుంది: కేసీఆర్

CM KCR Speech at Nagarkurnool Brs Public Meeting : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని కొందరు నేతలు మాట్లాడుతున్నారని.. ఒకవేళ అదే జరిగితే మళ్లీ లంచాల రాజ్యం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్​... గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కొత్త వేషాలతో మోసగాళ్లు మళ్లీ బయలు దేరారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ సర్కారుకు.. బీఆర్​ఎస్ సర్కారుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.

పాలమూరు ఎంపీగా ఉంటూనే రాష్ట్రం సాధించా: నాగర్‌ కర్నూలు జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకపోయి ఉంటే నాగర్‌కర్నూలు జిల్లా కాకపోయేది.. ఈ ఆఫీసులు వచ్చేవి కావు అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో పాలమూరు నుంచి ఎంపీగా పోటీపై ప్రొఫెసర్‌ జయశంకర్‌తో చర్చించానన్న కేసీఆర్... అప్పట్లో పాలమూరులో ఉద్యమం బలంగా లేకపోయినా తనను గెలిపించారని గుర్తు చేశారు. తాను పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణను సాధించుకున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన 9 ఏళ్లలో కరోనా, నోట్ల రద్దు ఇబ్బంది పెట్టినా అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగం వంటి ఎన్నో అంశాల్లో రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

'మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించుకున్నాం. చెరువులు, చెక్‌డ్యామ్‌లతో పాలమూరులో జలకళ ఉట్టిపడుతోంది. అచ్చంపేట ప్రాంతంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం. పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకున్నదని నేనే పాట రాశా. వలనపోయినోళ్లంతా వాపస్‌ వచ్చారు.. వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎకరం పదివేలకు అమ్ముకున్నారు.. ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా దళిత బంధుకు శ్రీకారం చుట్టాం. గతంలో పార్టీలు పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టేవి. గంజి కేంద్రాల స్థానంలో ఇప్పుడు పంట కొనుగోలు కేంద్రాలు వచ్చాయి. గతంలో పాలించిన పార్టీలు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయాయి.'-ముఖ్యమంత్రి కేసీఆర్

రెవెన్యూ రికార్డులు మార్చే అధికారం నాకు కూడా లేదు : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మర్రి జనార్దన్‌రెడ్డి పట్టుబట్టి నాగర్‌కర్నూలుకు వైద్య కళాశాల రప్పించుకున్నారన్నారు. గత పాలకులు ఒక్కరూ పాలమూరుకు మెడికల్ కళాశాలలు తేలేదని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ రాకముందు అంతా లంచాలమయంగా ఉండేదన్న సీఎం కేసీఆర్... ఈ పోర్టల్‌తో అధికారుల వద్ద ఉన్న అధికారాన్ని ప్రజలకు ఇచ్చామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు మార్చే అధికారం ఇప్పుడు సీఎంనైన తనకు కూడా లేదన్నారు. రైతుబంధును బంగాళాఖాతంలో కలిపితే.. రైతులను సముద్రంలోకి నెట్టేసినట్లే అని కేసీఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ ఉండాలో.. లేదో రైతులే నిర్ణయించుకోవాలని తెలిపారు.

'ఇదే జిల్లా నుంచి వచ్చిన ఒక ప్రబుద్ధుడు.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు. ధరణి రాకతో పైరవీలు, లంచాలకు అడ్డుకట్టపడింది. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ లంచాల రాజ్యం వస్తుంది. గతంలో రైతుబంధు ఇవ్వాలని ఒక్క సీఎం కూడా భావించలేదు. ధరణి వల్ల 99 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయి. కాంగ్రెస్‌ రాజ్యంలో దళారీలదే భోజ్యం. మహారాష్ట్రకు వెళ్తే తెలంగాణ మోడల్‌ కావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, హత్యలు జరిగేవో ఆలోచించండి. మళ్లీ రైతులను పోలీస్‌స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్‌ కుట్ర చేస్తోంది.మోసపోతే గోసపడతాం.. జాగ్రత్తగా ఆలోచించాలి. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని అప్పట్లో ఆంధ్రానేతలు శాపాలు పెట్టారు. ఇప్పుడేమైంది.. తెలంగాణ ధగధగ వెలిగిపోతోంది.. ఆంధ్రాలో చీకట్లు కమ్ముకున్నాయి. నేను ఏది తలపెట్టినా భగవంతుడు నన్ను ఓడించలేదు.. గెలిపించాడు. మీరే నా బలగం.. మీరే నా బంధువులు.ధరణిలో సమస్యలు ఉంటే.. అధికారులకు చెప్పండి.. పరిష్కరిస్తారు.'-ముఖ్యమంత్రి కేసీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details