అది నాగర్‌కర్నూలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. అక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ బడిలో చదివే విద్యార్థులు ప్రతిఏటా గురుకుల పాఠశాలలో సీట్లు సాధిస్తూ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారు. దీనివెనుక అంకితభావంతో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. అంతకుమించి వినూత్నంగా పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. చింతలపల్లిలోని ప్రభుత్వ పాఠశాల గురించి తెలుసుకున్న గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు మరింత నాణ్యమైన విద్య కోసం సొంతంగా విద్యా వాలంటరీ నియమించారు.
సాధారణ బడి.. రైలుబడిగా మారిందిలా..
చింతలపల్లి ప్రభుత్వ పాఠశాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తన వంతుగా రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ నగదుతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఆకర్షించే విధంగా.. వారి బడిన ఓ రైలు బండిలా తీర్చిదిద్దారు.