నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భారతీయ శివసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చైనా దురాగతాలను ఎండగట్టారు. అనంతరం ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అచ్చంపేటలో జిన్పింగ్ దిష్టిబొమ్మ దహనం - జిన్పింగ్ దిష్టిబొమ్మ దహనం
భారతదేశ సరిహద్దుల్లో చైనా చేసిన దురాగతానికి నిరసనగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మను అచ్చంపేటలో దహనం చేశారు. డ్రాగన్ దేశపు వస్తువులను తక్షణమే ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఘర్షణలో వీర మరణం పొందిన జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అచ్చంపేటలో జిన్పింగ్ దిష్టిబొమ్మ దహనం
డ్రాగన్ దేశపు వస్తువులను తక్షణమే ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. చైనా - భారత్ సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన జవానుల ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరారు. వీర జవాన్ల మృతికి కారణమైన చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. భారత సైనికులకు యావద్దేశం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు.