తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2020, 6:13 PM IST

ETV Bharat / state

అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని చెంచుల ధర్నా

నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ నల్లమలలో ఆదివాసీ చెంచులు మన్ననూర్​ ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న తమ మీద అటవీ అధికారులు నిబంధనల పేరుతో జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని చెంచుల ధర్నా
అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని చెంచుల ధర్నా

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ చెంచులు మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎంతో కాలం నుంచి చెంచులు అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని చెంచు సంఘం నాయకులు తెలిపారు. అడవి రక్షణ పేరుతో అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మన్ననూర్​ ఐటీడీఏ అధికారికి వినతి పత్రం

చెంచులు అడవిలో స్వేచ్ఛగా బతుకనీయకుండా నిబంధనల పేరుతో అడవిని నమ్ముకొని జీవితం వెళ్లదీస్తున్న తమ మీద జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కుల దేవతలకు పూజలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించట్లేదన్నారు. ధర్నాకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇద్దరు చెంచులు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details