నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రోడ్డు షోలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు, మోసాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'ఒవైసీ, కేసీఆర్ కుటుంబాలకు చరమగీతం పాడాలి' - ఓవైసీ, కేసీఆర్ కుటుంబాలకు చరమగీతం పాడాలి
బంగారు తెలంగాణ దేవుడెరుగుకాని కేసీఆర్ కుటుంబం బంగారంలా తయారైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నాగర్కర్నూల్లో విమర్శించారు. రాష్ట్రం మొత్తం మద్యం తెలంగాణగా మారిపోయిందని మండిపడ్డారు.
'ఓవైసీ, కేసీఆర్ కుటుంబాలకు చరమగీతం పాడాలి'
ఒవైసీ, కేసీఆర్ కుటుంబం రెండూ కలిసి కుటుంబ పాలన చేస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒవైసీ, కేసీఆర్ కుటుంబాలకు చరమగీతం పడాలన్నారు. 2023లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: విరసం కార్యదర్శి కాశీంను హాజరుపర్చండి: హైకోర్టు ఆదేశం