లక్ష్య ఎక్స్టర్నల్, రక్ష అసెస్మెంట్లో భాగంగా దిల్లీ నుంచి ప్రొఫెసర్ గిరీశ్ ద్వివేది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రీత జీఎస్... నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, వసతులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి కల్పిస్తున్న వసతులు, రోగుల పట్ల సిబ్బంది వైఖరి గురించి వివరాలు సేకరించారు. రెండు రోజుల పాటు నివేదికలు సిద్ధం చేసి కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు అందజేసేందుకు పరిశీలించినట్లు బృందం సభ్యులు తెలిపారు.
కల్వకుర్తి పీహెచ్సీలో కేంద్రం బృందం తనిఖీ - inspection in kalwakurthy phc
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని... కేంద్ర బృందం సందర్శించింది. ఆసుపత్రిలో వసతులు, సేవలపై నివేదిక సిద్దం చేసి కేంద్రానికి సమర్పించనున్నట్లు సభ్యులు తెలిపారు.
కల్వకుర్తి పీహెచ్సీలో కేంద్రం బృందం తనిఖీ