తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్న మార్గానికి జాతీయ రహదారి హోదా రానుంది. కల్వకుర్తి-నాగర్‌కర్నూల్-కొల్లాపూర్ (తెలంగాణ) నుంచి ఆత్మకూర్-నంద్యాల (ఆంధ్రప్రదేశ్)కు వెళ్లే మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించే దస్త్రంపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సంతకం చేసినట్లు రహదారులు, భవనాల శాఖకు సమాచారం అందింది.
భారతమాల కింది కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి - జాతీయ రహదారిగా కల్వకుర్తి-నంద్యాల మార్గం
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య... కల్వకుర్తి-నంద్యాల మార్గాన్ని భారతమాల పథకం కింద జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధించి దస్త్రంపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేసినట్లు రహదారులు, భవనాల శాఖకు సమాచారం అందింది.
![భారతమాల కింది కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి central government announced kalwakurthy-nandyala national highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9266186-331-9266186-1603335207112.jpg)
భారతమాల కింది కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి
మౌఖికంగా తమకు సమాచారం అందిందని, త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఐ.గణపతిరెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు. 170 కిలోమీటర్లు ఉన్న ఆ మార్గాన్ని భారతమాల పథకం కింద విస్తరించేందుకు కేంద్రం ముందుకురావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణానదిపై సోమశిల వద్ద అతిపెద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి కూడా మార్గం సుగమమైంది.
ఇవీ చూడండి: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ఉత్తమ్
TAGGED:
kalwakurthy-nandyala highway