సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో భాజపా కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు తెలిపారు.
సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్.. భాజపా సంబురం - సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో భాజపా కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు గ్రీన్‌సిగ్నల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... పట్టణంలో ర్యాలీ తీశారు.

కొల్లాపూర్‌లో భాజపా కార్యకర్తల సంబురాలు
వంతెనకు, జాతీయ రహదారి కోసం రూ. 765 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. స్థానిక ఎమ్మెల్యేకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపమని గతంలో పలుమార్లు కోరినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు.
ఇదీ చూడండి:నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం