నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో కృష్ణానది నుంచి మూగజీవాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న వారిపై జీవహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవంగా అక్కడి నుంచి రాయలసీమకు వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
నదీమార్గంలో మూగజీవాలను తరలిస్తున్న వారిపై కేసు - Case registered against moved to cattle
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో.. కృష్ణానది నుంచి మూగజీవాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న వారిపై జీవహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మర బోటు, పుట్టిల ద్వారా పశువులకు తరలించిన 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మూగజీవాలను తరలిస్తున్న వారిపై కేసునమోదు
కృష్ణానదిలో 5 కిలోమీటర్లు ప్రయాణమే కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ మూగజీవాలతో ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో పశువులను బోటు ద్వారా తరలించిన 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఐ