BRS MLC Damodar Reddy attend Congress Programme : నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవలే దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన మాత్రం అటు అధికార పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు విధిగా హాజరవుతూ వచ్చారు.
కొద్దిరోజుల క్రితమే గద్వాలలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు.. దామోదర్ రెడ్డి హాజరయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా బాధితులకు అందజేశారు. కానీ ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో అనధికారికంగా దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దామోదర్ రెడ్డి రాక సందర్భంగా హస్తం శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తోందని నేతలు భావిస్తున్నారు. మరోవైపు నాగర్‌కర్నూల్ అభ్యర్థిత్వంపై ధీమాగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana Congress Latest News : ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని.. దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి చర్చించారు. మల్లు రవితో భేటీ అనంతరం దామోదర్ రెడ్డి స్పందించారు. నాగం జనార్దన్‌రెడ్డితో మాట్లాడిన తర్వాత తన తుది నిర్ణయం ఉంటుందని వివరించారు. నాగంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. కొన్ని ఇబ్బందులు వచ్చి హస్తం పార్టీని వీడినట్లు పేర్కొన్నారు.
MLC Damodar Reddy Latest News : తాను 20 సంవత్సరాలు కాంగ్రెస్‌లో పని చేశానని దామోదర్ రెడ్డి తెలిపారు. మళ్లీ అదే పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని మల్లు రవిని అడిగినట్లు వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్తో క్యాడర్‌తో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు గుర్తు చేసుకున్న ఆయన.. ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ మార్పుపై తుది నిర్ణయం ఉంటుందని దామోదర్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ క్రమంలోనే దామోదర్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ విషయాన్ని ఎలా పరిగణిస్తుందనే విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇవీ చదవండి:Revanthreddy on Congress Tickets : 'సర్వేల ప్రాతిపదికనే టికెట్లు.. ఈ 6 నెలలు కష్టపడి పనిచేయండి'
Joinings in Telangana Congress : నేటి నుంచి కాంగ్రెస్‌లో చేరికల కోలాహలం..