రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బీజేవైఎం నేతలు మండిపడ్డారు. తెరాస నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని మన్ననూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ప్రభుత్వం నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్లను జారీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.