నాగర్‌కర్నూల్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర నిధులు లేని రాష్ట్ర పథకాలు ఏమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరింపుల పార్టీ కావాలా, పోరాటాల పార్టీ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. కేంద్ర నిధులపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
కేంద్ర నిధులు లేని రాష్ట్ర పథకాలు ఏమిటో చెప్పాలి: బండి - బండి సంజయ్ వార్తలు
కేంద్ర నిధులు లేని రాష్ట్ర పథకాలు ఏమిటో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణతో కలిసి పాల్గొన్నారు.
![కేంద్ర నిధులు లేని రాష్ట్ర పథకాలు ఏమిటో చెప్పాలి: బండి bjp state president bandi sanjay mlc campaign in nagar karnul district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10898185-thumbnail-3x2-nda.jpg)
కేంద్ర నిధులు లేని రాష్ట్ర పథకాలు ఏమిటో చెప్పాలి: బండి
తెరాస బెదిరింపులతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. వామన్‌రావు దంపతుల హత్యపై సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులను తెరాస నేతలు బెదిరిస్తున్నారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ ఆరోపించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు