నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం అమ్మపల్లి గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలంటూ భాజపా నాయకులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. రహదారి లేక పోవడంతో వర్షాలు పడి రాకపోకలకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా అసెంబ్లీ ఇన్‌ఛార్జి దిలీప్ చారి ఆరోపించారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి తిమ్మాజీపేట వరకు 5 కిలో మీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు.
రహదారి నిర్మించాలంటూ భాజపా నాయకుల ధర్నా - నాగర్‌కర్నూలు జిల్లా తాజా వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్మపల్లి గ్రామానికి రహదారి వేయించాలంటూ భాజపా నాయకులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. గ్రామానికి రహదారి లేకపోవడంతో వర్షాలు పడి రాకపోకలకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మేరకు గ్రామం నుంచి తిమ్మాజీ పేట వరకు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు.
![రహదారి నిర్మించాలంటూ భాజపా నాయకుల ధర్నా bjp protests and rally in nagar kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9279076-1045-9279076-1603417911601.jpg)
రహదారి నిర్మించాలంటూ భాజపా నాయకుల ధర్నా
అధికారులు, నాయకులు రహదారి వేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని దిలీప్ చారి దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే గ్రామానికి రహదారి వేయించాలన్నారు. తిమ్మాజీపేట మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టడంతో పోలీసులు వచ్చి నాయకులను అరెస్ట్ చేసారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇదీ చదవండి:'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్ఆర్ఎస్'