నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా జిల్లా అధ్యక్షుడు ఏలేని సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ తీర్మానంపై కొల్లాపూర్‌లో భాజపా ధర్నా - సీఏఏ వ్యతిరేక తీర్మానంపై భాజపా ఆగ్రహం
అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేక తీర్మానంపై భాజపా నిరసన వ్యక్తం చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది.
![అసెంబ్లీ తీర్మానంపై కొల్లాపూర్‌లో భాజపా ధర్నా bjp protest on anti caa amendment in state assembly in kollapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6454682-633-6454682-1584531693164.jpg)
అసెంబ్లీ తీర్మానంపై కొల్లాపూర్‌లో భాజపా ధర్నా
ఇలాంటి పనులు చేస్తే కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని సుధాకర్ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేసేందుకు ఉద్యమం చేస్తామని తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
అసెంబ్లీ తీర్మానంపై కొల్లాపూర్‌లో భాజపా ధర్నా
ఇవీచూడండి:'ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులను తీసుకోలేం'