నాగర్కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన జొన్నల బొగుడ జలాశయం నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... భాజపా దీక్ష చేపట్టింది. శ్రేణులతో కలిసి పంపుహౌజ్ వద్ద జిల్లా భాజపా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు నిరాహార దీక్ష నిర్వహించారు. అక్కడకు చేరుకున్న అధికారులు రెండు రోజుల్లో ఆయకట్టుకు నీరు విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామన్న హామీతో దీక్ష విరమించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల నీటి విడుదలకు భాజపా దీక్ష - కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు భాజపా డిమాండ్
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన జొన్న బొగుడ జలాశయం నుంచి నీరు విడుదల చేయాలని భాజపా దీక్ష చేపట్టింది. రెండు రోజుల్లో నీరు విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామన్న అధికారుల హామీతో దీక్ష విరమించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల నీటి విడుదలకు భాజపా దీక్ష
జలాశయం సామర్ధ్యం 2.14 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 1.05 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆయకట్టు కింద వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు ఒక తడి కోసం నీళ్లు విడిచిపెట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు నీటి విడుదలకు సైతం అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ శాసనభ్యుడు బీరం హర్షవర్దన్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: ఏబీఎస్ పెట్టుబడులతో పెరిగిన డేటా ఉద్యోగాలు..