తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన

నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భాజపా కార్యకర్తలపై దాడులకు దిగిన తెరాస నేతలను అరెస్టు చేయాలని ఆందోళన చేశారు. జనార్దన్​ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

తెరాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన

By

Published : Jun 6, 2019, 3:37 PM IST

నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి, ఎమ్మెల్యే అభ్యర్థి దిలీపాచారి , జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, పార్టీ కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. భాజపా కార్యకర్తలపై దాడులకు దిగిన తెరాస నేతలను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ దాడిపై జనార్దన్​ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఏఎస్పీ జోగుల చెన్నయ్య నచ్చజెప్పినా నాయకులు ససేమిరా అన్నారు. 15 మంది కమలం పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

తెరాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన

ABOUT THE AUTHOR

...view details