తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా సమయంలో పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలి' - nagar kurnool vidyut office

విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్​ విద్యుత్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్​ చేశారు.

bjp-leaders-protest-in-front-of-nagar-kurnool-vidyut-office
కార్యాలయం ముందు బైఠాయించి భాజపా నేతల ఆందోళన

By

Published : Jun 15, 2020, 9:03 PM IST

విద్యుత్ బిల్లుల పెంపుపై భాజపా ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్లో నిరసన చేపట్టారు. పెంచిన విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సుధాకర్​రావు ఆధ్వర్యంలో ఆందోళన జరిగాయి. ప్రభుత్వ చర్యల వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని అన్నారు. విద్యుత్ శాఖ కార్యాలయంలోకి వెళ్లి నినాదాలు చేశారు.

ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. మోయలేని విద్యుత్ బిల్లులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే కరెంటు బిల్లులను ప్రభుత్వం భరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి :మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌

ABOUT THE AUTHOR

...view details