నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి సాగునీరందించాలని దుర్వాసుల చెరువు నుంచి అమ్రాబాద్ వరకు భాజపా నాయకులు పాదయాత్ర నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
పదర, అమ్రాబాద్ మండలాలకు సాగు నీరు అందిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు. కనీసం ఇప్పుడు శిలాఫలకం వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుతో వాగ్దానం చేయించారు.