తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు. శ్రీశైలం తిరుగు జలాల్లో నీట మునిగిన పంపులను చూడడానికి వెళ్తుంటె అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది: సుధాకర్‌రావు
కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ ఎత్తిపోతల ప్రాజెక్టును, శ్రీశైలం తిరుగు జలాల్లో నీట మునిగిన పంపులను సందర్శించడానికి వెళ్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలమూరు రంగారెడ్డి సొరంగం పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ చేయడంతో మోటార్లు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు.
తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేకం: ఎల్లేని సుధాకర్‌రావు
ప్రాజెక్టులో సాంకేతిక సమస్య లేదని.. పాలమూరు రంగారెడ్డి సొరంగం పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ చేయడంతోనే మోటార్లు దెబ్బతిన్నాయని ఆరోపించారు. రైతుల పక్షాన భాజాపా ఉంటుందన్నారు. రైతులకు ఏ నష్టం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని.. అక్రమంగా అరెస్టులు చేయడం తగదని అన్నారు.
ఇదీ చూడండి: 30 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం