నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభోత్సవానికి రాగా... సభా వేదిక వద్ద నిరసనకు యత్నించారు. రైతు వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రుల సభలో ఉద్రిక్తత.. భాజపా నేతల ఆందోళన - నాగర్ కర్నూల్ జిల్లా పాలెంలో భాజపా కార్యకర్తల నిరసన
రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రుల సభా వేదిక వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైతు వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.
భాజపా కార్యకర్తల నిరసన
సభకు అడ్డుతగలడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వేదిక వద్దకు దూసుకొస్తున్న భాజపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కార్యకర్తలు సభావేదిక వద్దకు చొచ్చుకు రాగా... వారిని అడ్డుకుని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అంతకుముందే వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 60 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.