నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో భాజపా ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా సోమశిల వద్ద కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. తెరాస ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చి రెగ్యులేటరీ ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టడం సరైంది కాదని భాజపా జిల్లా అధ్యక్షుడు ఏలేని సుధాకర్ అన్నారు. 203 జీవోతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సీమాంధ్రకు ఒత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోతిరెడ్డుపాడు నిర్మాణానికి వ్యకిరేకంగా భాజపా జలదీక్ష - కృష్ణానదిలో భాజపా జలదీక్ష
పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో సోమశిల వద్ద... భాజపా ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ఏది ఏమైనా పోతిరెడ్డిపాడు నిర్మాణాన్ని అడ్డుకుంటామని జిల్లా అధ్యక్షుడు ఏలేని సుధాకర్ హెచ్చరించారు.

పోతిరెడ్డుపాడు నిర్మాణానికి వ్యకిరేకంగా భాజపా జలదీక్ష