నాగర్కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్, బల్మూరు, లింగాల మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదమయ్య అనే రైతు కుటుంబసభ్యులతో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో గాలి వాన మొదలైంది. పొలంలోని గడ్డివాము తడవకుండా దానిపై కవరు కప్పేందుకు ప్రయత్నిస్తుండగా..పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. ఈ ఘటనలో ఈదమయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈదమయ్య మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నల్లమలలో పిడుగుపాటుకు రైతు దుర్మరణం - నల్లమలలో పిడుగుపాటుకు రైతు దుర్మరణం
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఈదమయ్య అనే రైతు పిడుగు పడి మృతి చెందాడు.

నల్లమలలో పిడుగుపాటుకు రైతు దుర్మరణం