తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు.. శ్రీ గంధంతో సిరులు - రాష్ట్ర వ్యవసాయ శాఖ

ప్రత్యామ్నాయ పంటలతో రైతులు అధిక లాభాన్ని ఆర్జిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జనార్దన్​రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ రైతు సాగుచేస్తోన్న శ్రీ గంధం మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు.

Benefits with alternative crops like sandalwood
ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు.. శ్రీ గంధంతో సిరులు

By

Published : Feb 25, 2021, 4:45 AM IST

రైతులు సాధారణ పంటలతో పాటు అప్పుడప్పుడు ప్రత్యామ్నాయ పంటలూ వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జనార్దన్​రెడ్డి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని పర్వతాయపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సాగుచేస్తోన్న శ్రీ గంధం మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు.

13 ఎకరాల్లో ఎకరానికి 450 శ్రీ గంధం చెట్లను పెంచుతున్నట్లు రైతు గోవర్ధన్ తెలిపారు. తోటలో.. వేరుశనగ, కూరగాయలతో పాటు అంతర పంటలగా పండ్ల మొక్కలు నాటుకోవచ్చన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామి రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వ్యాపారం ప్రభుత్వ విధి కాదు: మోదీ

ABOUT THE AUTHOR

...view details