నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెరాసలో చేరాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, కొంతమంది పెద్దలు తనను అడుగుతున్నారని తెలిపారు. సొంతంగా నిర్ణయం తీసుకోనని, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాట్లాడతానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు.
గులాబీ గూటికి కొల్లాపూర్ ఎమ్మెల్యే..? - Beeram Harshavardhan reddy is ready to change party
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరూ గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలుపుకుని మొత్తం ఏడుగురు హస్తం పార్టీ శాసనసభ్యులు తెరాసలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. తాజాగా బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా కారెక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
![గులాబీ గూటికి కొల్లాపూర్ ఎమ్మెల్యే..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2705113-374-4de71f8f-a979-4524-8b78-c668e4ff1733.jpg)
గూలాబీ గూటికీ కొల్లాపూర్ ఎమ్మెల్యే!
Last Updated : Mar 16, 2019, 10:29 AM IST