నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల వద్ద పచ్చదనం.. పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొండల నడుమ వంపులు తిరిగిన రహదారి మీదుగా ప్రయాణం చక్కటి అనుభూతిని కలిగిస్తోంది.
పచ్చదనం పరుచుకున్న సోమశిల
ఎటుచూసిన ప్రకృతి అందాలు. ఎర్రరాతినేలలు. ఎత్తైన గుట్టలు. జలసవ్వడులు. ఇటీవల వర్షాలకు నాగర్ కర్నూల్‌లోని సోమశిల వద్ద పచ్చదనం పరుచుకోవడంతో.. పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొండల నడుమ వంపులు తిరిగిన రహదారి మీదుగా ప్రయాణం చక్కటి అనుభూతిని కలిగిస్తోంది.
పచ్చదనం పరుచుకున్న సోమశిల
నిండుగా పారుతున్న కృష్ణమ్మ ఒడిలో బోటు ప్రయాణం ఉల్లాసాన్ని ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనుమతి ఇవ్వడంతో... వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు సోమశిలకు తరలి వస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చదవండి:క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం