ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచాల యుగంధర్ గౌడ్ మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లను చూడడానికి వెళ్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులకు, బీసీ సంఘం నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్ట్ మోటర్లను చూడడానికి వెళ్తుంటే అరెస్ట్ చేయడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచాల యుగంధర్ గౌడ్ అన్నారు.