తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్​బీఐ ముందు బ్యాంకు ఉద్యోగుల సమ్మె - బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా నాగర్​కర్నూల్​ పట్టణంలోని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ముందు బ్యాంకర్లు ధర్నా నిర్వహించారు. తమకు 20 శాతం వేతనం పెంచాలంటూ డిమాండ్​ చేశారు.

bankers protest in nagarkarnool
ఎస్​బీఐ ముందు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

By

Published : Feb 1, 2020, 10:31 AM IST

బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు బ్యాంకర్లు శుక్రవారం ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. బ్యాంకు ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు.

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నారని జిల్లా బ్యాంకర్ల అసోసియేషన్​ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. తమకు 20 శాతం వేతనం పెంచాలని... ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని... ఫ్యామిలీ పింఛన్లు పెంచాలంటూ... డిమాండ్ చేశారు. ఇండియా బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ తన మొండి వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు.

ఎస్​బీఐ ముందు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఇదీ చూడండి: టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details