ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో.. బ్యాంకు సిబ్బంది ఆందోళన చేపట్టారు. 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు జరుగుతోన్న ఈ సమ్మెలో.. పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
'ప్రైవేటీకరణతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు' - బ్యాంకు సిబ్బంది ఆందోళన
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో.. బ్యాంకు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'ప్రైవేటీకరణతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు'
ప్రైవేటీకరణ వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు అందవంటూ.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయన్నారు. కేంద్రం తక్షణమే.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఎల్ఐసీ ప్రైవేటీకరణతో సంస్థ, ఉద్యోగులకు నష్టం: నామ