నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో భాజపా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ 114వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా అధ్యక్షుడు ఎల్ఎం.సుధాకర్ రావు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
'అణగారిన వర్గాలకు జగ్జీవన్‌రామ్ చేసిన కృషి మరువలేనిది' - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా అధ్యక్షుడు ఎల్ఎం.సుధాకర్ రావు.. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
jagjivan ram jayanthi, bangaru sruthi, kollapur
అణగారిన వర్గాలకు బాబు జగ్జీవన్‌రామ్ చేసిన కృషి మరువలేనిదని వారు కొనియాడారు. సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నాటి పాలనలో పేదలు, శ్రామికులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
ఇదీ చూడండి:'ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి జగ్జీవన్‌రామ్'