అయోధ్య రామమందిరం కరసేవకులకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. నాగర్కర్నూల్ కల్వకుర్తి పురపాలికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయోధ్య రామమందిర కరసేవకులకు సన్మానం - కల్వకుర్తిలో రామమందిర కరసేవకులకు సన్మానం
అయోధ్య రామమందిర నిర్మాణ పనుల్లో కరసేవకు వెళ్లిన వారికి సన్మానం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
అయోధ్య రామమందిర కరసేవకులకు సన్మానం
ఈ ప్రాంతానికి చెందిన వారు గతంలో ఇంటికి ఒకరు కర సేవకు వెళ్లేవారని, కరసేవకులుగా పనిచేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలన్నారు. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ మత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ఆర్ఎస్ఎస్, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.