నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో వివిధ గ్రామాల క్రిమిసంహారక, ఎరువుల విత్తన దుకాణ యజమానులతో కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సదస్సులో పాల్గొని అవగాహన కల్పించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అమ్మకాలు చేసే యజమానులు నిబంధనలకు లోబడి ఎరువులు, విత్తన విక్రయాలు చేపట్టాలని ఆయన సూచించారు.
కల్వకుర్తిలో ఎరువుల డీలర్లకు పోలీసుల అవగాహన సదస్సు - awareness program to pesticide dealers by police in kalwakurthy
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలికతో పాటు, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన క్రిమిసంహారక, ఎరువుల, విత్తనాల దుకాణదారులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఖరీఫ్‌లో చేసే అమ్మకాలు నిబంధనలకు లోబడి చేపట్టాలని డీఎస్పీ గిరిబాబు సూచించారు.
కల్వకుర్తిలో ఎరువుల డీలర్లకు పోలీసుల అవగాహన సదస్సు
క్రిమిసంహారక మందులు, విత్తనాలు ఎరువులను అధిక మొత్తంలో నిల్వ చేయకూడదని... ఒకవేళ నిల్వచేసినా వాటికి ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సిందిగా గిరిబాబు పేర్కొన్నారు. ఎరువుల దుకాణాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అమ్మకందారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు పొంది ఉండాలని వివరించారు. ప్రతి కొనుగోలుకు రైతులకు తప్పనిసరిగా బిల్లులు అందజేయాలని యజమానులకు తెలిపారు.
ఇవీ చూడండి:గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్ విజృంభణ!