తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకోవటమే లక్ష్యం' - regulated cultivation

నాగర్​కర్నూల్​లో వానకాలం 2020 నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నియోజకవర్గ స్థాయి రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ పాల్గొన్నారు. రైతులకు పలు సూచనలు చేశారు.

awareness program on regulated cultivation in nagar karnool
'దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకోవటమే లక్ష్యం'

By

Published : May 30, 2020, 11:53 AM IST

దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం వచ్చిందంటే అది సీఎం కేసీఆర్ ముందు చూపుతోనేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర్ంజన్​రెడ్డి తెలిపారు. మరో ఏడాది లోపు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నాగర్ కర్నూల్​లో నిర్వహించిన వానకాలం 2020 నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నియోజకవర్గ స్థాయి రైతుల అవగాహన సదస్సులో నిరంజన్​రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పాల్గొన్నారు.

దశాబ్ద కాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో అన్ని రకాల పంటలు పండించే ప్రాంతంగా తెలంగాణ మారుతుందని మంత్రి ఆకాంక్షించారు. దిగుమతుల వ్యవసాయం నుంచి ఎగుమతుల స్థాయికి చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూస ధోరణిలో కాకుండా వైవిధ్యమైన పంటలు వేసి రైతులు లాభాలు ఆర్జించాలని మంత్రులు సూచించారు.

ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ABOUT THE AUTHOR

...view details