నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని పలు పార్టీలకు చెందిన నేతలు.. ఇంఛార్జ్ కమిషనర్ బాలచంద్రసృజన్, ఎన్నికల అధికారి సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. పురపాలక సంఘం సమావేశ మందిరం నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులను నిలదీశారు. మరణించిన వ్యక్తులు, పక్క వార్డుల ఓటర్లు ఉన్నారని ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల పరిధిలో ఉన్నాయన్నారు.
ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం - ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం
కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పుడు దొర్లాయంటూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు.. అధికారులను నిలదీశారు. మరణించిన వ్యక్తులు, పక్క వార్డుల ఓటర్లు జాబితాలో ఉన్నారని ఫిర్యాదుచేశారు.
ఓటర్ల జాబితాలో తప్పులపై నేతల అభ్యంతరం
నేతల అభ్యంతరాలతో అవగాహన సదస్సు కాస్త గందరగోళంగా మారింది. అభ్యంతరాలు ఉన్నవారు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని అధికారులు సూచించారు. పరిశీలించి జాబితా సరిచేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్