నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటను సాగు చేయకుండా పంటల మార్పిడి చేయాలని ఎంపీ సూచించారు. వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు.
పంటల మార్పిడితో మేలు : ఎంపీ రాములు - nagarkurnool mp ramulu latest news
పంటల మార్పిడితో మేలు జరుగుతుందని ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
పంటల మార్పిడితో మేలు: ఎంపీ రాములు
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని జైపాల్ యాదవ్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలు సాగు చేయాలన్నారు.
ఇదీ చదవండిఃకరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!