తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి పురస్కారం - hyderabad

నాగర్​ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి  కేవీకే ఉత్తమ పరిశోధన సంస్థ పురస్కారం లభించింది. జిల్లా నీటి సంరక్షణపై రైతుల్లో శిక్షణ, ప్రదర్శన, అవగాహన సదస్సుల ద్వారా చైతన్యం కలిగించడం వల్ల అవార్డు అందుకుంది. ప్రొఫెసర్ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నాబార్డు 38వ వ్యవస్థాపక దినోత్సవంలో పురస్కారాన్ని అందజేశారు.

పురస్కారం అందజేత

By

Published : Jul 23, 2019, 11:39 PM IST

రంగారెడ్డి జిల్లా ప్రొఫెసర్ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాబార్డు 38వ వ్యవస్థాపక దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాగర్​ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి కేవీకే ఉత్తమ పరిశోధన సంస్థ పురస్కారం అందించారు. నీటి సంరక్షణలో భాగంగా సూక్ష్మసేద్యం, మల్చింగ్‌, నీటి గుంటలు వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా ఈ పురస్కారం లభించింది.

ABOUT THE AUTHOR

...view details