నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య విషయాలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అవగాహన కల్పిస్తున్న తమకు రూ. పది వేల వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా - asha workers darna infront of mro office
ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం రూ. పదివేల గౌరవ వేతనం చెల్లించాలంటూ నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
గ్రామాల్లో మహిళలకు ఏ సమస్య వచ్చినా ఆశా కార్యకర్తలు ముందుండి పని చేస్తున్నా... వారికి గౌరవ వేతనం ఇవ్వట్లేదని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు శివవర్మ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్