శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను వెంటనే కూల్చేయాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ కాలనీవాసులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఉదయపు నడక (మార్నింగ్ వాక్) నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డులను సందర్శించారు.
పట్టణాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్ - latest news on collector sridhar conducted morning walk in nagarkurnool
పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణాల్లో పర్యటించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉదయపు నడక నిర్వహించారు.

పట్టణాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్
వార్డుల్లో పందులకు స్థావరాలుగా ఉన్న ఖాళీ ప్రదేశాలు, ముళ్లకంపలు, చెత్తను తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని సూచించారు. ఖాళీగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ చేయించుకోవాలని యజమానులకు చెప్పాలని.. అయినా అలాగే ఉంచితే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పర్యటించి పట్టణాల్లోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
పట్టణాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్
ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్