తెలంగాణ

telangana

ETV Bharat / state

​​​​​​​అనారోగ్యంతో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి - Nagar Kurnool District At Chitteboyanapalli Social Welfare Gurukul School student died

నాగర్​ కర్నూల్​ జిల్లా చిట్టెబోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మేఘన అనారోగ్యంతో మృతి చెందింది. సిబ్బంది నిర్లక్షం వల్లనే మేఘన చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

​​​​​​​అనారోగ్యంతో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

By

Published : Nov 1, 2019, 12:31 PM IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లికు చెందిన వెంకటేశ్, అలివేలు దంపతుల ఇద్దరు కూమార్తెలు మేఘన, పుజిత. వీరు జడ్చర్ల మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పది, ఐదవ తరగతి చదువుతున్నారు.

బుధవారం సాయంత్రం విద్యార్థిని తలనొప్పిగా ఉందని సిబ్బందికి చెప్తే.. మాత్రలు ఇచ్చారు. అర్థరాత్రి ఒక్కసారిగా కడుపునొప్పి రావటం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెందిందంటూ హైదరాబాద్‌-రాయచూర్‌ రహాదారిపై బైఠాయించి విద్యార్థి సంఘాలు సహా కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు భాదిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

​​​​​​​అనారోగ్యంతో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

ఇదీ చూడండి : పసివాళ్లపై వార్డెన్ లైంగిక వేధింపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details