తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో వ్యక్తి మృతి.. అధికారులే ఖననం - nagarkarnool district latest news

కరోనాతో వ్యక్తి మృతి చెందగా… బంధువులు, గ్రామస్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులే మృతదేహాన్ని ఖననం చేసిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

corona, died person
కరోనాతో వ్యక్తి మృతి.. అధికారులే ఖననం

By

Published : Apr 24, 2021, 3:36 PM IST

నాగర్​ కర్నూల్ జిల్లా అమ్రాబాద్​ మండలం బీకే తిర్మలాపూర్​ గ్రామానికి చెందిన తిర్పతయ్య (50) కు జ్వరం రావడంతో మండల కేంద్రంలోని ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను సంప్రదించారు. దాంతో వారు కరోనా పరిక్ష నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి కి పంపించారు. అక్కడ కరోనా టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్​గా తేలింది. దీంతో చికిత్స కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న తిర్పతయ్య ఎవరికీ చెప్పకుండా పారిపోయి సొంత ఊరు తిర్మలాపూర్​కు చేరుకున్నాడు. అక్కడ గ్రామస్థులు ఊర్లోకి రాకుండా అడ్డుకోవడంతో మళ్లీ అమ్రాబాద్ చేరుకున్నాడు.

నిన్న రాత్రి అమ్రాబాద్ పాత బస్టాండ్ వద్ద నిద్రిస్తుండగా శ్వాస ఆడకపోవడంతో మరణించాడు. ఇతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు, గ్రామస్థులు ఎవరూ రాకపోవడం స్థానికులను కలచివేసింది. దీంతో అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details