రోజురోజుకు పెరిగిపోతున్న పిల్లల అపహరణ... ఇళ్లలోకి చొరబడి చోరీలు... అనుకోకుండా ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించి వాటిని మరచిపోవడం... ఇలాంటి ఎన్నో సమస్యలు ఆ యువకుడిని ఆలోచింపజేశాయి. ఆ ఆలోచనల్లోంచి పరిష్కారాలుగా నూతన సాంకేతికతతో పరికరాల సృష్టికి కారణమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటు ధరల్లో తనదైన శైలిలో పరికరాలు రూపొందిస్తున్నాడు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన శ్రీ రామదాసు ధర్మసాయి.
ట్రాకింగ్ పరికరం...
చిన్నపిల్లల అపహరణ రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో ట్రాకింగ్ పరికరం సాయంతో కిడ్నాప్‌కు గురైన వారిని సులభంగా కనిపెట్టవచ్చని చెబుతున్నాడు. చిన్నారులు పరిధిని దాటి బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులను అప్రమత్తం చేసేలా ప్యాకెట్ జీపీఎస్ ట్రాకర్‌ను రూపొందించాడు. దానిని చిన్నారుల జేబు, బ్యాగుల్లో పెట్టుకోవచ్చు. గూగుల్ మ్యాప్ ద్వారా పరిధిని నిర్ణయించి నమోదు చేసుకోవాలి.
రూ.700 మాత్రమే...