తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిసరాల శుభ్రం కోసం 10 నిమిషాలు కేటాయించాలి' - Sunday is a dry day for 10 minutes at 10am

ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రం చేసేందుకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రజలకు సూచించారు. నాగర్​ కర్నూల్​ జిల్లాలోని తన స్వగృహంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన మేరకు.. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు.

'Allot 10 minutes to clean up the surroundings'
'పరిసరాల శుభ్రం కోసం 10 నిమిషాలు కేటాయించాలి'

By

Published : Jun 14, 2020, 1:01 PM IST

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అన్నారు. నాగర్​ కర్నూల్​లోని తన స్వగృహంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన మేరకు.. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంట్లోని పూల కుండిలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

అప్రమత్తత అవసరం

ప్రతి ఒక్కరు ఆదివారం పరిసరాలను శుభ్రం చేసేందుకు 10 నిమిషాలు కేటాయించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. మట్టి గుంటలు, మురికి కాల్వలు, మట్టి పాత్రల్లో నిల్వ ఉండే నీటిని తీసివేసి దోమలను నిర్మూలించాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలని కోరారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

ABOUT THE AUTHOR

...view details