ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 5 నుంచి జరగబోయే ఆర్టీసీ సమ్మెకు నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సమావేశ మందిరంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు... కాంగ్రెస్, భాజపా,వామపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఆర్టీసీ బంద్కు అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించినట్లు తెలిపాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీల మద్దతు - కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులతో ఆర్టీసీ కార్మికులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీల మద్దతు