పార్టీలకతీతంగా కలిసికట్టుగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఆడిటోరియంలో నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని అఖిలపక్ష నాయకులు తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం చేసే ఈ దురాగతానికి తెరాస ప్రభుత్వం వత్తాసు పలికే విధంగా చర్యలు చేపడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నాయకులు ఎండగట్టారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే అడవి వల్లకాడు అవుతుందన్నారు. అరుదైన పెద్దపులి అంతరించిపోతుందని, చెంచులు అంతరించిపోతారన్నారు. కృష్ణా నది కలుషితమై రెండు రాష్ట్రల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని నాయకులు పేర్కొన్నారు.
యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం - nallamala
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
అఖిలపక్ష సమావేశం
ఇదీ చూడండి : మంత్రివర్గంలో ఆరుగురికి చోటు