జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 44 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... నాగర్‌కర్నూల్ జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి మను చౌదరి తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించి, పోలింగ్ శాతాన్ని వెల్లడించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల మైదానంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ప్రత్యేక నిఘా...
పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 13వ తేదీన ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్‌తో పాటు అదనంగా లార్జ్ సైజ్ బ్యాలెట్ బాక్స్ చేరవేయనున్నట్లు వెల్లడించారు.