తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా పర్వాలేదు... - kalwakurthy
వేసవి కాలాన్ని తల్లిదండ్రులకు దూరంగా ఉండి... శిక్షణలో అద్భుతంగా రాణించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి సూచించారు. ఉపాధ్యాయులు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారనే అంశాలను విద్యార్థులను అడిగి మాట్లాడించే ప్రయత్నం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని సీపీఎం కళాశాల సమీపంలోని అక్షరవనంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి శిబిరంలోని చిన్నారులతో మాట్లాడారు. వేసవి సెలవుల్ని శిక్షణతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఏ అంశాల్లో రాణించాలనుకుంటున్నారోనని అడిగారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఈ ఆర్టీ డైరెక్టర్ శేషు కుమారి, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయకుమార్, నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్, ఎన్జీవో బాసు నాయక్ తహశీల్దార్ గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.