నిందితులను కఠినంగా శిక్షించాలి - sfi rally in nagar karnool
శంషాబాద్ ఘటనకు నిరసనగా నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
పశు వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నాగర్‌కర్నూల్‌లో విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. మహిళలు ఆపదలో ఉంటే 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.